Header Banner

ఆటోమేషన్ ఎఫెక్ట్...! అమెరికాలో డెలివరీ రంగంలో జాబ్స్ కట్!

  Tue May 06, 2025 09:34        U S A

అమెరికాలోని రెండు ప్రధాన డెలివరీ, పోస్టల్ సేవల సంస్థలైన యునైటెడ్ పార్సెల్ సర్వీస్ (యూపీఎస్), యూఎస్ పోస్టల్ సర్వీస్ (యూఎస్‌పీఎస్) ఈ ఏడాది వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవడం, కార్యకలాపాలను ఆధునికీకరించడం, ముఖ్యంగా ఆటోమేషన్‌ను పెంచడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం డెలివరీ రంగంలోని వేలాది మంది కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ యూపీఎస్, తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 4 శాతం అంటే సుమారు 20,000 ఉద్యోగాలను ఈ ఏడాది తొలగించనున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గత వారం ప్రకటించారు. అంతేకాకుండా, జూన్ నెలాఖరు నాటికి 73 పంపిణీ కేంద్రాలను మూసివేయనున్నట్లు తెలిపారు.

తమ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను ఆధునికీకరించే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు, దాదాపు 400 కేంద్రాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా ఆటోమేషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు యూపీఎస్ వివరించింది. తమ అతిపెద్ద కస్టమర్ అయిన అమెజాన్‌తో వ్యాపార కార్యకలాపాలను 2026 ద్వితీయార్థం నాటికి 50 శాతానికి పైగా తగ్గించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా యూపీఎస్ ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించింది. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూఎస్ పోస్టల్ సర్వీస్ కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉంది.

సుమారు 100 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూసిన ఈ సంస్థ, భవిష్యత్తులో మరో 200 బిలియన్ డాలర్లు నష్టపోవచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో, సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 10,000 ఉద్యోగులను తగ్గించనున్నట్లు మార్చి నెలలో అప్పటి పోస్ట్‌మాస్టర్ జనరల్ లూయిస్ డీజాయ్ ప్రకటించారు. 2024 నాటికి యూఎస్‌పీఎస్‌లో 5,33,724 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోత, ఆటోమేషన్ వంటి చర్యలు చేపట్టినా తమ వినియోగదారుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని యూపీఎస్ చెబుతుండగా, యూఎస్‌పీఎస్ సేవలపై మాత్రం కొంత ప్రభావం ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AutomationImpact #JobCuts #USDeliverySector #UPS #USPS #LogisticsJobs #TechVsJobs #AutomationWave